మీరు టాటా మోటార్స్ ట్రక్ ని కొనుగోలు చేసినప్పుడు, మీరు కేవలం ఒక ఉత్పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం లేదు, సర్వీస్, రోడ్డు సైడ్ సహాయం, బీమా, విధేయత మరియు ఇంకా మరెన్నో ఉన్న ప్రతీ దానితో కూడిన పలు సేవల్ని కొంటున్నారు. మీరు ఇప్పుడు మీ వ్యాపారం పై హృదయపూర్వకంగా దృష్టి సారించగలరు, సంపూర్ణ సేవ తక్కిన విషయాలు గురించి శ్రద్ధవహిస్తుంది.
సంపూర్ణ సేవ 2.0 సరికొత్త మరియు పెంపొందించబడిన సేవ. నిరంతరంగా మెరుగుపడుతున్న ఈ సమగ్రమైన సర్వీస్ ని తయారు చేయడానికి గత ఏడాదిలో మా కేంద్రాల్ని సందర్శించిన 6.5 మిలియన్ కస్టమర్లు నుండి మేము ప్రతిస్పందన సేకరించాము.
29 రాష్ట్ర కార్యాలయాలు, 250+ టాటా మోటార్స్ ఇంజనీర్లు, ఆధునిక సామగ్రి , సదుపాయాలు మరియు 24x7 మొబైల్ వ్యాన్లు ఉండే 1500కి పైగా ఛానల్ భాగస్వాముల సహాయం నుండి మీరు ప్రయోజనం పొందుతారు.
టాటా మోటార్స్ అందించే సంపూర్ణ సేవ మీ వాహనాన్ని కొనుగోలు చేయడం నుండి , మీ వ్యాపారం మీ ఇంట అడుగు పెట్టేంత వరకు మీ వ్యాపారానికి ఒక సంపూర్ణమైన సంరక్షణ ప్యాకేజీ. అది బీమా కావచ్చు లేదా బ్రేక్ డౌన్, రివార్డ్స్ లేదా జన్యుయిన్ స్పేర్స్, రీసేల్ లేదా వారంటీ కావచ్చు, సంపూర్ణ సేవ అన్నింటినీ కవర్ చేస్తుంది. ఇప్పుడు మీరు దేని గురించి విచారించనవసరం లేదు, కేవలం మీ వ్యాపారం పై దృష్టిసారించండి, తదుపరి స్థాయికి తీసుకువెళ్లండి.
ప్రధానంగా, టాటా మోటార్స్ మీతో ప్రతీ అడుగులో ఉంటుంది.
అన్ని చిన్న వాణిజ్య వాహనాలు పై 2 సంవత్సరాలు /72000 కిమీతో (ఏది ముందైతే దాని ప్రకారం) డ్రైవ్ లైన్ వారంటీతో, అభివృద్ధి చేయడానికి మీ వ్యాపారాన్ని మేము రోడ్డు పైకి తీసుకురావడానికి కృషి చేస్తాం.
2011 ఫిబ్రవరిలో ప్రారంభించబడిన టాటా డిలైట్ భారతదేశంలో వాణిజ్య వాహనాల పరిశ్రమలో మొట్ట మొదటి కస్టమర్ విధేయత కార్యక్రమం. టాటా వాహనాల్ని కొనుగోలు చేసిన కస్టమర్లు అందరూ ఆటోమేటిక్ గా ఈ లాయల్టీ కార్యక్రమంలో సభ్యులవుతారు.
టాటా ఓకేతో, ముందుగా స్వంతం చేసుకున్న టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల్న మీరు విక్రయించవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. ఎటువంటి తప్పు పనులు జరగకుండా నివారించడానికి కొనుగోలు, సంపాదన మరియు మూల్యాంకనం, పునరుద్ధరణ మరియు పునరుద్ధరణ చేసిన వాహనాల సేల్ యొక్క ప్రతీ దశలో మా ప్రమేయం ఉంటుంది.
సంవత్సరాలు తరబడి టాటా వాణిజ్య వాహనాల్ని పరిపూర్ణమైన స్థితిలో ఉంచడానికి, మేము టాటా జెన్యుయిన్ పార్ట్స్ (టీజీపీ)ని అందిస్తాము. టాటా మోటార్స్ వారి విభాగమైన, టీజీపీ విడి భాగాలు యొక్క 1.5 లక్షలకు పైగా ఎస్ కేయులను టాటా వాణిజ్య వాహనాల్ని నిర్వహణకు అందిస్తోంది. ఈ విడి భాగాల్లో ప్రతీది వివిధ నాణ్యతా తనిఖీలు ద్వారా ఖచ్చితమైన వాహనం వివరణల్ని నెరవేర్చి తయారయ్యాయి, ఫలితంగా పరిపూర్ణమైన ఫిట్ గా ఏర్పడింది, పెరిగిన సర్వీస్ జీవిత కాలం మీ వాహనాన్ని ఎక్కువ దూరాలకు తీసుకువెళ్లడానికి ఎక్కువ అప్ టైంకి దారితీసింది.
పూర్తి నివారణ మరియు ప్రణాళికాబద్ధమైన నిర్వహణ, వాహనం డ్రైవ్ లైన్ యొక్క బ్రేక్ డౌన్ మరమ్మతుల్ని ముందుగా నిర్ణయించిన ధరకు సంరక్షణవహించే వార్షిక నిర్వహణ ప్యాకేజీ. ప్రస్తుతం, భారతదేశంవ్యాప్తంగా 60,000+కి పైగా కస్టమర్లు టాటా సురక్షని కలిగి ఉన్నారు. SCV కార్గో మరియు పిక్ అప్స్ కోసం 3-సంవత్సరాల కాంట్రాక్ట్స్ లభిస్తున్నాయి.
మా 24x7 రోడ్‌సైడ్ సహాయ కార్యక్రమం అన్ని టాటా మోటార్స్ వాణిజ్య వాహన మోడళ్లకు వారంటీ వ్యవధిలో, దేశవ్యాప్తంగా ఎక్కడైనా, స్థానంతో సంబంధం లేకుండా 24 గంటల్లో పరిష్కారాన్ని వాగ్దానం చేస్తుంది.
*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.
అత తక్కువ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు మరమ్మతు చేసే సేవలు ద్వారా టాటా కవచ్ మీ వ్యాపారం ఎన్నడూ కూడా ఆగిపోకుండా నిర్థారిస్తుంది. ఎంపిక చేయబడిన వర్క్ షాప్స్ లో మాత్రమే టాటా మోటార్స్ బీమా క్రింద బీమా చేయబడిన వాహనాలకు ఇది వర్తిస్తుంది.
*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.
వాహనం డౌన్ టైం మరియు మొత్తం యజమాని ఖర్చుని తగ్గించడానికి ఎక్స్ ఛేంజ్ ఆధారంగా మళ్లీ-తయారు చేయబడిన ఇంజన్లను టాటా మోటార్స్ ప్రొఫైల్ అందిస్తుంది.
టాటా జిప్పీ అన్ని BS6 వాహనాలు కోసం మరమ్మతు సమయం యొక్క హామీ కార్యక్రమం. ఇది టోల్ -ఫ్రీ నంబర్ ద్వారా లేదా వర్క్ షాప్ లో నివేదించిన ఏదైనా సమస్యకు ఫాస్ట్-ట్రాక్ సర్వీస్ ని సేల్ తరువాత 12 నెలలు లోగా లేదా వాహనం ఉత్పత్తి చేసిన 14 నెలలు తరువాత , ఏది ముందు అయితే దాని ప్రకారం పూర్తి చేస్తుంది.
*నియమాలు మరియు షరతులు వర్తిస్తాయి.